
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
సాక్షి,యాదాద్రి : మహిళలు అన్ని రంగాల్లో రాణించి సాధికారత సాధించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. చదువుతో పాటు ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్వావలంబన తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఒక మహిళ ఉన్నతస్థాయిలో ఉంటే కుటుంబానికి, సమాజానికి ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ మహిళలు సాధికారత సాధించడం వల్ల సమాజం, కుటుంబం అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ నేటి సమాజాంలో మహిళలు విద్య, విజ్ఞానంతో ముందుకెళ్తుండడం అభినందనీయమన్నారు. జేఏసీ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో తమ సహాయ సహకారం ఉంటుందన్నారు. అనంతరం ఆటలపోటీల్లో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే కలెక్టరేట్‌లో పని చేస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. కార్యక్రమంలో కలక్టరేట్ ఏఓ జగన్మోహన్‌ప్రసాద్, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఈఓ సత్యనారాయణ, టీజీఓ జనరల్ సెక్రటరీ కవిత, సెక్రటరీ ఖదీర్, నాన్ గెజిటెడ్ ట్రెజరర్ శ్రీకాంత్, శ్రీనివాస్, చైతన్య, జిల్లా కోశాధికారి సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment