
సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక వ్యూహం
అడ్డగూడూరు : శాంతిభద్రల పరిరక్షణతో పాటు సైబర్‌నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక వ్యూహం రూపొందిస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. శుక్రవారం అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌ను ఆయన డీసీపీ రాజేశ్‌చంద్రతో కలిసి తనిఖీ చేశారు. నూతన భవనం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విజిబుల్ పోలీసింగ్, సైకిల్ పెట్రోలింగ్ ద్వారా ప్రజలకు మరింత చేరువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సైబర్‌నేరాలు, రోడ్డు సేఫ్టీ, మహిళల భద్రత వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేషన్‌లో రికార్డులు, కేసుల దర్యాప్తు, పురోగతి, సీసీటీవీల నిర్వహణపై సమీక్షించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు. రూ.1.52 కోట్ల వ్యయంతోప్రత్యేక వసతులతో కూడిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ నిర్మిస్తామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజేశ్‌చంద్ర, ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, రామన్న పేట సీఐ వెంకటేశ్వర్లు, అడ్డగూడూరు, మోత్కూర్,అత్మకూరు ఎస్‌ఐలు నాగరాజు, నాగరాజు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ రాచకొండ సీపీ సుధీర్‌బాబు
ఫ అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment