
యాదాద్రి భువనగిరి
అక్కడ.. ఇక్కడ కాదు.. ఎక్కడైనా వివక్షే!
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025
సమాజంలో సగభాగమైన మహిళలు ఇంటా బయట ఇంకా వివక్షను ఎదుర్కొంటున్నారు. ఆధునిక సమాజంలోనూ పురాతన పోకడలు
కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సాక్షి’ ఉమ్మడి జిల్లాలోని ఏడు ముఖ్య పట్టణాల్లో మహిళల ఇబ్బందులపై నిర్వహించిన సర్వేలో పలు విషయాలు వెలుగుచూశాయి. 18 నుంచి 50 సంవత్సరాల వయస్సున్న 200 మంది మహిళలను సర్వే చేయగా.. ఇప్పటికీ ఇంట్లో ఆడ, మగ వివక్షను ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. –సాక్షి నెట్‌వర్క్
ఫ ఆడ మగ వివక్ష ఇంట్లో కూడా ఉంది
ఫ బయట ప్రదేశాలకన్నా ఆఫీస్, కళాశాలల్లోనే ఎక్కువ ఇబ్బంది
Comments
Please login to add a commentAdd a comment