
అమృత్ మహోత్సవ్‌లో చేనేత కళాకారులు
‘ఇక్కత్’ను పరిశీలించిన రాష్ట్రపతి
భూదాన్‌పోచంపల్లి: రాష్ట్రపతి భవన్‌లో అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ నుంచి ఏర్పాటు చేసిన హస్తకళల ఎగ్జిబిషన్‌ను శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ ఉప ముఖ్యమంతి భట్టి విక్రమార్క సందర్శించారు. పోచంపల్లికి చెందిన రాష్ట్ర ఉత్తమ అవార్డు గ్రహీత ఎన్నం మాధవిశివకుమార్ ఏర్పాటు చేసిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను వారు పరిశీలించారు. కళాత్మకమైన ఇక్కత్ డిజైన్లు, నాణ్యత, పోచంపల్లి ఇక్కత్‌కు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపును తెలుసుకొని రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారని చేనేత కళాకారిణి ఎన్నం మాధవి శివకుమార్ తెలిపారు.
సంస్థాన్ నారాయణపురం: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శనివారం నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం తరఫున సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన చేనేత కళాకారులు గూడ శ్రీను, ఆయన కుమారుడు పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత ప్రాచీన కళ తేలియారూమాల్ వస్త్రం రూపొందించడాన్ని గూడ శ్రీను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చూపించారు. వారిని రాష్ట్రపతి అభినందించినారు. కార్యక్రమంలో కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిజాసింగ్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
సిరిపురం చేనేత వస్త్రాల ప్రదర్శన
రామన్నపేట: మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన కళాభారతి హ్యాండ్లూమ్ హ్యాండ్‌క్రాఫ్ట్ ప్రొడ్యూసర్ కంపెనీకి చెందిన జెల్ల సత్యనారాయణ, జెల్ల శ్రీనాథం పోచంపల్లి పట్టుచీరలు, మెర్స్‌రైజుడ్ చీరలు, బెడ్‌షీట్లు, డ్రెస్ మెటీరియల్, చున్నీలను రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్టాల్‌ను సందర్శించి సత్యనారాయణ, శ్రీనాథంను అభినందించారు.

అమృత్ మహోత్సవ్‌లో చేనేత కళాకారులు

అమృత్ మహోత్సవ్‌లో చేనేత కళాకారులు
Comments
Please login to add a commentAdd a comment