
మహిళా సంక్షేమానికి పెద్దపీట
ఫ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని ఓ హోటల్‌లో జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 150కి పెరిగితే ఉంటే అందులో 50 మంది మహిళలే ఎమ్మెల్యేలుగా ఉంటారన్నారు. మహిళా బిల్లు కూడా త్వరలో అమలవుతుందని పేర్కొన్నారు. బీసీ కుల గణనతో 42శాతం బీసీలకు రిజర్వేషన్ వర్తిస్తుందని అన్నారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఉచిత బస్సు సౌకర్యం, మహిళా సంఘాలకు క్యాంటీన్ల నిర్వహణ వంటి అవకాశాలు కాంగ్రెస్ ప్రభుత్వ కల్పించిందన్నారు. త్వరలో 1000 కొత్త ఆర్టీసీ బస్సుల మెయింటెనెన్స్‌ను మహిళా సంఘాలకు అప్పగిస్తామన్నారు. జిల్లాలోని మహిళా సంఘాలకు 50 బస్సులను కేటాయించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గోపగాని మాధవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, రూ.500కే సిలిండర్ అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ మాజీ ప్రజాప్రతినిధులను, మహిళా కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, వంగూరి లక్ష్మయ్య, మహిళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బ రూపఅశోక్‌సుందర్, రాష్ట్ర కార్యదర్శి ఎస్‌కే జాను, పట్టణ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కందిమల్ల నాగమణిరెడ్డి, జిల్లా కార్యదర్శి లలిత, సదాలక్ష్మి, సంకు ధనలక్ష్మి, విజయలక్ష్మి, కంచర్ల మాధవి, జూలకంటి ధనలక్ష్మి, సూరెడ్డి సరస్వతి, స్వరూప రెడ్డి సౌజన్య, సుకన్య, నిర్మలాదేవి, సువర్ణ, పద్మలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment