
కుటుంబ పోషణలో భర్తకు తోడుగా..
ఆత్మకూర్ (ఎస్): కుటుంబ పోషణలో భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకు గాను ఊరూరా మోటార్ సైకిల్‌పై తిరిగి కూరగాయలు అమ్ముతూ ఆదర్శంగా నిలుస్తోంది మాసారపు సుగుణమ్మ. ఆత్మకూర్(ఎస్)
మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామానికి చెందిన మాసారపు సుగుణమ్మ, స్వామి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. చిన్న అమ్మాయి మానసిక వికలాంగురాలు. వీరికి వ్యవసాయ భూమి లేకపోవడంతో భర్త స్వామి సూర్యాపేట నుంచి కూరగాయలు హోల్‌సేల్‌గా తెచ్చి గ్రామంలో వీధి వీధి తిరుగుతూ అమ్ముతున్నాడు. అతనొక్కడి సంపాదనపై ఆధారపడి కుటుంబ పోషణ ఇబ్బందిగా మారడంతో సుగుణమ్మ అదే గ్రామంలో గంప నెత్తినెత్తుకొని కూరగాయలు అమ్మేది. ఈ క్రమంలో ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లు చేశారు. అయితే సుగుణమ్మకు మోకాళ్లు, మెడ నొప్పులు రావడంతో కూరగాయల గంప నెత్తినెత్తుకొని తిరగడం ఇబ్బందిగా మారడంతో సైకిల్‌పై చుట్టుపక్కల గ్రామాలు వెళ్లి కూరగాయలు అమ్మేది. సైకిల్‌పై తిరగడం కూడా ఇబ్బందిగా ఉంటుండటంతో వారి కుమార్తె ఎనిమిది నెలల క్రితం టీవీఎస్ ఎక్సెల్ బైకులు కొనిచ్చింది. ఈ మోటార్ సైకిల్‌కు మూడు చక్రాలు అమర్చారు. దీంతో సుగుణమ్మ కూరగాయలను ఈ బండిపై పెట్టుకొని నెమ్మికల్‌తో పాటు 7, 8 కిలోమీటర్ల దూరం దాకా వెళ్లి వ్యాపారాన్ని కొనసాగించి కుటుంబ పోషణలో భర్తకు తోడుగా నిలుస్తోంది. ఇలా భార్యాభర్తలు కూరగాయలు విక్రయించి రోజుకు రూ.800 నుంచి రూ.1000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించుకోవడం సంతోషంగా ఉందని సుగుణమ్మ తెలిపింది.
ఫ ఊరూరా తిరిగి మోటార్ సైకిల్‌పై
కూరగాయలు అమ్ముతున్న భార్య

కుటుంబ పోషణలో భర్తకు తోడుగా..
Comments
Please login to add a commentAdd a comment