
పాల బిల్లులు చెల్లించాలని ధర్నా
ఆత్మకూరు(ఎం) : మదర్ డెయిరీ, విజయ డెయిరీలు బకాయి బిల్లుల చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూర్(ఎం) మండలంలోని కూరెళ్ల పాల కేంద్రం ఎదుట శనివారం పాడి రైతులు ధర్నా చేశారు. రెండు డెయిరీల నుంచి రూ.85 కోట్లు రావాల్సి ఉందని, నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడం వల్ల పాడిపరిశ్రమ నిర్వహణ ఇబ్బందికరంగా మారిందన్నారు. పాడి పరిశ్రమను ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. దేశీయ పాలను కాకుండా విదేశాలనుంచి కేంద్రం పాలను దిగుమతి చేసుకోవడం వల్ల పాడి రైతులు నస్టాలు చవిచూడాల్సి వస్తుందన్నారు. ఈనెల 10లోగా బిల్లులు చెల్లించని పక్షంలో 11వ తేదీన కలెక్టరేట్ ఎదుట జిల్లాలోని పాడి రైతులంతా కలిసి ధర్నా చేయనున్నట్లు వెల్లడించారు. ధర్నాలో వేముల భిక్షం, రైతులు తుమ్మలగూడెం యాదయ్య, నార్కట్‌పల్లి మల్లయ్య, మొరుగాని శ్రీనువాస్, కన్నెబోయిన శంకరయ్య, జోగు కుమార్, బాషబోయిన నరేష్, ఎండి షకీల్, మారుపాక పరుశరాములు, ఐలమ్మ, సోమక్క అండాలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment