
తాగునీటి సమస్య రావొద్దు
నల్లగొండ : ‘వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య రావొద్దు.. అధికారులు మనసు పెట్టి పనిచేయాలి.. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి’ అని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. శనివారం నల్లగొండలోని ఉదయాదిత్య భవన్‌లో సాగు, తాగునీరు, విద్యుత్‌పై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో సాగు, తాగునీరు, విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ వేసవిలో తాగు, సాగు నీరు, విద్యుత్ ఇబ్బందులు ఏర్పడకుండా ఫిబ్రవరిలో సమావేశం నిర్వహించుకోవాల్సి ఉన్నా ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైందన్నారు. ఈ మూడు శాఖలకు చెందిన పైస్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఇందులో పోలీస్, రెవెన్యూ అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు. వేసవిలో ఏర్పడే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్ల వద్ద కొంత నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యేల వద్ద కూడా నిధులు అందుబాటులో ఉంచేలా ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను కృష్ణాలో అనుసంధానం చేసే ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. డీఆర్‌సీ సమావేశాలు నిర్వహించుకునే విషయంలో కూడా అధికారులు దృష్టి సారించాలి. ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై సంబంధిత అదికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లు వీటిపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు.
కాల్వల నిర్వహణ సరిగా లేదు : గుత్తా
శాసనమండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వల నిర్వహణ సరిగా లేదన్నారు. ఏఎమ్మార్పీ కాల్వ లైనింగ్ చేపట్టాలన్నారు. కాల్వల్లో రైతులు పెద్ద మోటార్లు వేసి నీరును లాగడం వల్ల చివరి భూములకు నీరు అందడం లేదన్నారు. విద్యుత్ కనెక్షన్ల మంజూరులో అధికారులు ఆచితూచి వ్యవహరించాలని సూచించారు.
ఫ అధికారులు మనసు పెట్టి పనిచేయాలి
ఫ సమస్య తలెత్తితే తక్షణమే పరిష్కరించండి
ఫ కలెక్టర్ల వద్ద నిధులు ఉంచుతాం
ఫ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
లో ఓల్టేజీ సమస్య పరిష్కరించాలి – మంత్రి కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వేసవిలో తాగునీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పంట చేతికి వచ్చే దశలో ఉన్నాయని.. ఎకరం పొలం కూడా ఎండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినప్పటికీ విద్యుత్ లోడ్ పెరిగి లోవోల్టేజీ సమస్య ఉత్పన్నమవుతోందని.. ఆ సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. కలెక్టర్లు తాగునీటిపై దృష్టి సారించాలని, ప్రతి పంచాయతీకి రూ.15 వేల వరకు అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్‌డీఎఫ్ నిధుల నుంచి తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, తేజస్ నందులాల్, మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ హరిలాల్, సీఈ అజయ్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ సీఈ వెంకటేశ్వర్లు, నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్రపవార్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి సమస్య రావొద్దు

తాగునీటి సమస్య రావొద్దు
Comments
Please login to add a commentAdd a comment