లోక్ అదాలత్‌లో 24,861 కేసులు పరిష్కారం
భువనగిరిటౌన్ : జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం జిల్లాలోని అన్ని కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్‌లలో 24,861 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో సివిల్ 12, క్రిమినల్ 2,231, ప్రిలిటిగేషన్ 27, ఇ–చలానా 22,591 కేసులు ఉన్నాయి. భువనగిరి కోర్టులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు లోక్‌అదాలత్‌ను ప్రారంభించారు. రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ పంచాక్షరి లోక్ అదాలత్‌ను పర్యవేక్షించి మాట్లాడారు. రాజీమార్గంతో కేసులు పరిష్కరించుకోవడం వల్ల శాంతియుత వాతావరణం ఏర్పడడంతో పాటు మానవ సంబంధాలు మెరుగుపడుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాధవిలత, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్యామ్‌సుందర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కవిత, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment