పగలు భగభగ.. రాత్రి గజగజ
భువనగిరి టౌన్ : జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉదయం 9 నుంచే ఎండతీవ్రత పెరుగుతోంది. తిరిగి సాయంత్రం 6గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. దీంతో పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. శుక్రవారం భూదాన్‌పోచంపల్లి మండలంలో గరిష్ట ఉష్ణోగ్రత 39.1 డిగ్రీలు నమోదు కాగా, బొమ్మలరామారంలో కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు పడిపోయింది. గడిచిన పది రోజులుగా వాతావరణంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో జనం అనారోగ్యం బారిన పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment