
పిల్లల కోరిక మన్నించి వివాహాలు చేయాలి
మిర్యాలగూడ: పిల్లలు ప్రేమించుకుంటే తల్లిదండ్రులు వారి కోరికను మన్నించి పెళ్లిళ్లకు అనుమతించాలి. కులం, పరువు ప్రతిష్టలు అనే అహంకారంతో హత్యలకు పాల్పడితే చట్టాల నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని గుర్తించించాలి. చట్ట ప్రకారం మేజర్లు అయితే పిల్లలు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించింది. అంబేద్కర్ స్ఫూర్తితో కులరహిత సమాజం వైపు అడుగులు వేయాలి. పిల్లలు కూడా సినిమా, టీవీల ప్రభావంలో ఆకర్షణలకు లోనై అదే ప్రేమ అనుకొని తల్లిదండ్రులను శత్రువులుగా చూసే వైఖరిని మానుకోవాలి. తల్లిదండ్రులను ఒప్పించి పెద్దలను మెప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయాలి.
– కస్తూరి ప్రభాకర్, సామాజికవేత్త, మిర్యాలగూడ
Comments
Please login to add a commentAdd a comment