
పంటలు ఎండిపోకుండా చూడండి : కలెక్టర్
సాక్షి,యాదాద్రి : పంటలు ఎండిపోకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగునీటిపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడెక్కడ పంటలు ఎండిపోతున్నాయో గుర్తించి అక్కడ ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణంలో అక్రమాలకు తావుండొద్దు
సాక్షి,యాదాద్రి : అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం అయ్యారు. లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, శేఖర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్ తదితరులు పాల్గొన్నారు.
నూరు శాతం
ఉత్తీర్ణత సాధించాలి
రామన్నపేట : పదవ తరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా సిద్ధం కావాలని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ విద్యార్థులకు సూచించారు. సోమవారం జనంపల్లి బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు సూ చనలు చేశారు. ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలన్నారు. అనంతరం సుమధుర ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టే నిర్మాణాల కోసం స్థలాలను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. ఆతరువాత ఇస్కిళ్ల గ్రామంలో గుండా సత్తయ్య మెమోరియల్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. ఆయనవెంట ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ లాల్‌బహదూర్, డీఈ యూసుఫ్, ప్రిన్సిపాల్ ఎస్. రాజా, సుమధుర ఫౌండేషన్ ప్రతినిధులు జీవన, అశ్రిత, ఉపాధ్యాయులు ఉన్నారు.

పంటలు ఎండిపోకుండా చూడండి : కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment