
ఉన్నత విద్యా ప్రమాణాలు పాటించాలి
నల్లగొండ టూటౌన్: విద్యాసంస్థలు ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తూ ముందుకుసాగాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీయూలో మంగళవారం నిర్వహించిన బీఈడీ కళాశాలల అకడమిక్ సమావేశంలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బీఈడీ కళాశాలల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలకు విద్యా ప్రమాణాలు మెరుగుపరచుటకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల హాజరుకు సంబంధించి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వై. ప్రశాంతి, డిప్యూటీ డైరెక్టర్ జయంతి, అమరేందర్, వివిధ బీఈడీ కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.
ఫ మహాత్మాగాంధీ యూనివర్సిటీ
వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
Comments
Please login to add a commentAdd a comment