
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
మిర్యాలగూడ: మిర్యాలగూడ మండలం నందిపాడు, రవీందర్‌నగర్‌లోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ శాఖ సీఐ ఎస్‌కే గౌస్ మాట్లాడుతూ.. లక్ష్మీవెంకటేశ్వర ఫర్టిలైజర్స్, మిర్యాలగూడ రైతు ఆగ్రో సేవా కేంద్రంలో దాడులు నిర్వహించి కాలం చెల్లిన మందులను గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు దుకాణ యజమానులపై కేసు నమోదు చేశామన్నారు. నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహిస్తున్నామన్నారు. కొంతమంది రైతులను సైతం విచారించినట్లు తెలిపారు. ఆయన వెంట కానిస్టేబుల్ నర్సింహారెడ్డి, ఏఓ ధీరావత్ సైదానాయక్, ఏఈఓ షఫీ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment