
తెలుగు శాఖకు విరాళం అందజేత
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో తెలుగు విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చే విద్యార్థులకు బంగారు పతకం అందించేందుకు గాను రిటైర్డ్ ప్రొఫెసర్లు ఇంద్రసేనారెడ్డి, ఎం. ఇంద్రారెడ్డి, కె. సత్యనారాయణరెడ్డి, కె. లింగారెడ్డి, కె. విజయేందర్‌రెడ్డి రూ.3లక్షల చెక్కును మంగళవారం యూనివర్సిటీలో వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్‌కు అందజేశారు. అదేవిధంగా ప్రతి ఏటా స్మారక ఉపన్యాసానికి మరో రూ.6లక్షల విరాళం అందించారు. ఈ విరాళాలను బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి ప్రతి సంవత్సరం బంగారు పతకం, స్మారక ఉపన్యాసం కోసం వెచ్చిస్తామని వైస్ చాన్స్‌లర్ తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, రిటైర్ట్ రిజిస్ట్రార్ నరేందర్‌రెడ్డి, ప్రొఫెసర్లు అంజిరెడ్డి, ఆకుల రవి, డాక్టర్ ఉపేందర్‌రెడ్డి, డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి, డాక్టర్ హరీష్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment