
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నకిరేకల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన జిల్లా వెంకటయ్య(54) ఈ నెల 8వ తేదీన బైక్‌పై నకిరేకల్‌కు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో తాటికల్ ఫ్లైఓవర్ వద్ద గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటయ్యను నల్లగొండ పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment