
మంత్రి పదవిపై ఉన్న ధ్యాస సమస్యలపై లేదు
చౌటుప్పల్ : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న ధ్యాస ప్రజా సమస్యలపై లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి విమర్శించారు. మంత్రి పదవి కోసమే కలవరిస్తున్నారే తప్ప ఆయనకు నియోజకవర్గ అభివృద్ధిపై ఆలోచన లేదన్నారు. చౌటుప్పల్ పట్టణంలో నీటి సమస్యను పరి ష్కరించాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం గాంధీపార్క్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు మహిళలు ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేకు ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకొస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు నియోజకవర్గ ప్రజలకు తాను ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయ్యారని విమర్శించారు. ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని, గ్రామాలకు వెళ్లాలంటే పోలీసు భద్రత అవసరమని, అందుకే మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని ఎద్దేవా చేశారు.తక్షణమే నీటి సమస్య పరిష్కరించకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, పట్టణ, మండల అధ్యక్షులు కడారి కల్పన, కై రంకొండ అశోక్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్‌బాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కంచర్ల గోవర్ధన్‌రెడ్డి, నాయకులు గుజ్జుల సురేందర్‌రెడ్డి, ఆలె చిరంజీవి, ముత్యాల భూపాల్‌రెడ్డి, రమనగోని దీపిక, పాలకూర్ల జంగయ్య, శాగ చంద్రశేఖర్‌రెడ్డి, ఊడుగు యాదయ్య, కడవేరు పాండు, వనం ధనుంజయ్య, కట్ట కృష్ణ, తడక సురేఖ, ముత్యాల పుష్ప, గోశిక పురుషోత్తం, నీరజ, కడారి అయిలయ్య, ఎడ్ల మహేశ్వర్‌రెడ్డి, బడుగు కృష్ణ, ఉప్పు ఆంజనేయులు, అమృతం దశరథ, బుడ్డ సురేష్ పాల్గొన్నారు.
ఫ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి