
యాదగిరిగుట్టలో శ్రీరామనవమి వేడుకలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని పూజారులు వైభవంగా నిర్వహించారు. సీతారామచంద్రస్వామికి ఉదయం విశేష పూజలు జరిపించి, 11.30గంటలకు శివాలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి సేవను ఊరేగించారు. యాదగిరిగుట్ట దేవాలయం తరఫున అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి దంపతులు, ఈఓ భాస్కర్‌రావు, ఆలయ అధికారులు, అర్చకులు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం శివాలయం ఉత్తర దిశలోని కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) చైర్మన్ ఎన్. సత్యనారాయణ, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు దంపతులు, ఆలయ అధికారులు, పూజారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. సోమవారం మధ్యాహ్నం 12.30గంటలకు సీతారామచంద్రస్వామికి పట్టాభిషేకం జరిపించనున్నారు.
స్వర్ణగిరి దేవాలయంలో..
భువనగిరిటౌన్: భువనగిరి పట్టణ సమీపంలోని స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం శీర్రామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.