
దళారులను నమ్మొద్దు
భువనగిరిటౌన్ : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మొ ద్దని అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరారెడ్డి పేర్కొన్నారు. ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర, సన్న వడ్లకు బోనస్ వివరాలతో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటా రూ.2,320, బి గ్రేడ్‌కు రూ.2,300 ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అదే విధంగా కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లు విక్రయించిన రైతులకు క్వింటా రూ.500 చెల్లిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, మార్కెటింగ్ శాఖ అధికారి సబిత, జిల్లా పంచాయతీ అధికారి సునంద పాల్గొన్నారు.