
వరంగల్ సభను జయప్రదం చేయాలి
నకిరేకల్: బీఆర్‌ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు నిండిన సందర్భంగా వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభ(చలో వరంగల్)ను జయప్రదం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను నకిరేకల్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. చలో వరంగల్ సభకు లక్షలాదిగా పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారని గుర్తు చేశారు. ఈ సభను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకునేందుకు కుట్ర చేయడం సరికాదన్నారు. ఈ సభకు తరలివెళ్లకుండా బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులను నిర్బంధించడంతో పాటు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మాద ధనలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, నాయకులు పల్లె విజయ్, పెండెం సదానందం, పల్‌రెడ్డి మహేందర్‌రెడ్డి, గొర్ల వీరయ్య, సోమ యాదగిరి, సామ శ్రీనివాస్‌రెడ్డి, వంటల చేతన్, యానాల లింగారెడ్డి, రాచకొండ వెంకన్నగౌడ్, బోయిళ్ల కిషోర్, గుండగోని జంగయ్య, రాచకొండ శ్రవణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య