
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
● మరొకరి పరిస్థితి విషమం
నల్లగొండ: నార్కట్‌పల్లి–అద్దంకి బైపాస్‌పై నల్లగొండ పట్టణంలోని లెప్రసీ కాలనీ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నల్లగొండ టూటౌన్ ఎస్‌ఐ ఎర్రం సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి నుంచి హైదరాబాద్‌కు షేక్ ఫిరోజ్ తన కుటుంబంతో కలిసి కారులో వెళ్తున్నాడు. అదేవిధంగా హైదరాబాద్‌లోని బోడుప్పల్‌కు చెందిన పిదురు అనిల్ తన తల్లిదండ్రులు రఘురామమూర్తి(80), స్వరాజ్యంతో కలిసి కారులో ఒంగోలుకు వెళ్తూ.. నార్కట్‌పల్లి–అద్దంకి బైపాస్‌పై నల్లగొండ పట్టణంలోని లెప్రసీ కాలనీ వద్ద డివైడర్‌ను ఢీకొన్నాడు. దీంతో అనిల్ ప్రయాణిస్తున్న కారు ఎగిరి అటుగా వస్తున్న ఫిరోజ్ కారుపై పడి పల్టీ కొట్టి రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో పడిపోయింది. స్థానికులు గమనించి 108 సిబ్బందికి సమాచారం అందించారు. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బాధితులను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రఘురామమూర్తి చికిత్స పొందుతూ మృతిచెందారు. ఫిరోజ్ బంధువు మహమూద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.