
పిచ్చమ్మకు బీఆర్‌ఎస్ నేతల నివాళి
మోత్కూరు: మోత్కూరు మండలంలోని దాచారం గ్రామంలో బీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర మాజీ కార్యదర్శి నేవూరి ధర్మేందర్‌రెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ ఇటీవల మృతి చెందారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మంగళవారం దాచారం గ్రామాన్ని సందర్శించి పిచ్చమ్మ చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం ధర్మేందర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మాతృమూర్తి రుణం తీర్చుకోలేనిదన్నారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేష్, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల అధ్యక్షులు పొన్నబోయిన రమేష్, ప్రభాకర్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, నాయకులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి హరీశ్‌రావు