
దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపండి
రాజాపేట, యాదగిరిగుట్ట రూరల్ : వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని, కార్యాలయాలకు తిప్పించుకోవద్దని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం రాజాపేట తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ధరణి సమస్యలకు సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. ధరణితో పాటు రేషన్ కార్డులు ఇతర సమస్యలపై వచ్చిన దరఖాస్తులు, విజ్ఞప్తులను జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతలోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజీవ్ యువ వికాసం పథకంపై యువతకు అవగాహన కల్పించి లబ్ధి పొందేలా చూడాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ అనిత, ఎంపీడీఓ నాగవేణి ఉన్నారు. అదే విధంగా యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ధరణిలో తప్పుడు రిపోర్టులకు తావు లేకుండా చూసుకోవాలని సూచించారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు