
మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు
నకిరేకల్: తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ నకిరేకల్‌లోని మెయిన్ సెంటర్‌లో పలు వాహనాలకు బుధవారం ఆయన పోస్టర్లు అంటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. వరంగల్ సభ పండుగను తలపించేలా ఉండబోతుందన్నారు. కేసీఆర్ ఇచ్చే సందేశాన్ని వినేందుకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అమలు చేస్తున్న పథకాలు సగానికే పరిమతయ్యారని ఆరోపించారు. రుణమాఫీ సగంలోనే ఆపేశారని, తులం బంగారం ఊసే లేదన్నారు. వరంగల్ సభకు నకిరేకల్ నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు తలారి బలరాం, మాద ధనలక్ష్మి, మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, నాయకులు పెండెం సదానందం, పల్లె విజయ్, దైద పరమేశం, వంటల చేతన్, రాచకొండ వెంకన్నగౌడ్, యానాల లింగారెడ్డి, సామ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య