
‘పోషణ పక్షం’ వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
భువనగిరిటౌన్ : జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘పోషణ పక్షం –25’ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ హనుమంతరావు అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం ప్రతి అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ పక్షం కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ఏరోజుకారోజు డాష్ బోర్డు యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. నేటి నుంచి (శుక్రవారం) ఈనెల 22వ తేదీ వరకు పోషణ పక్షం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ నాగిరెడ్డి, జిలా సంక్షేమ అధికారి నరసింహరావు, డీఎంహెచ్‌ఓ మనోహర్, డీపీఓ తదితరులు పాల్గొన్నారు.