
గౌస్‌కొండలో మద్యపాన నిషేధం
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని గౌస్‌కొండలో మద్యపాన నిషేధం అమలుచేస్తూ గ్రామస్తులు గురువారం తీర్మానం చేశారు. బెల్ట్‌షాపుల వల్ల యువత మద్యానికి బానిసలుగా మారుతుండడం, కుటుంబాలు అన్ని విధాలా ఇబ్బందులు పడుతుండడంతో గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించాలని నిర్ణయించారు. ఈ మేరకు రామాలయం ఆవరణలో గ్రామపెద్దలు, మహిళలతో సమావేశం ఏర్పాటు చేసి సామూహిక ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో డప్పు చాటింపు కూడా వేయించారు. ఇకపై ఎవరైనా మద్యం విక్రయాలు చేస్తే వారికి రూ.25వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. సమాచారం ఇచ్చిన వారికి ఐదు వేల రూపాయల పారి తోషికం ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గొంగిడి వెంకట్‌రెడ్డి, మర్రి పాండురెడ్డి, నోముల శ్రీనివాస్‌రెడ్డి, మునుకుంట్ల నరేశ్ మద్ది తశ్వన్‌రెడ్డి, వంగూరురవి, వంగూరి యాదగిరి, వారాల పాండురెడ్డి, గొంగిడి రామిరెడ్డి, వాకిటి జంగారెడ్డి, నారాయణరెడ్డి, కొయ్యడ గనేశ్, బాలరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.