
కేంద్రం నిధులిచ్చే పథకాలకు పీఎం ఫొటో పెట్టాలి
మోత్కూరు : కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పోస్టర్లు, ఫ్లెక్సీల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫొటో పెట్టాల్సిందేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం మోత్కూరులో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం, మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలకు హాజరయ్యారు. అనంతరం గావ్ చలో...బస్తీ చలో అభియాన్‌లో భాగంగా స్థానిక చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్తకొండ ఉషారాణి, సుష్మ, బద్ధం మహేందర్‌రెడ్డి, సాయిచరణ్‌లు బీజేపీలో చేరారు. బీజేపీ మున్సిపల్ శాఖ అధ్యక్షురాలు చాడ మంజుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాప రవి, కూరాకుల వెంకన్న, మల్లెపాక సాయిబాబు, గుజ్జ సోమనర్సయ్య, నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని