
వరంగల్ సభను విజయవంతం చేయాలి
భువనగిరి : బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో సభకు తరలిరావాలన్నారు. అనంతరం సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జడల అమరేందర్, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ కన్వీనర్ కొల్పుల అమరేందర్, భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఆంజనేయులు, పార్టీ పట్టణ, మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిర ణ్‌కుమార్, జనగాం పాండు. రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జేడ్పీటీసీ బీరు మల్లయ్య, నాయకులు లక్ష్మీనారాయణ, గోపాల్, సత్తిరెడ్డి,అబ్బగాని వెంకట్, భిక్షపతి, పాండు, వినోద్, జహంగీర్ పాల్గొన్నారు.