
రైతన్నలకు అకాల కష్టం
సాక్షి,యాదాద్రి: వరినాట్లు మొదలుకొని.. చేతికొచ్చిన ధాన్యం అమ్ముకునే దాకా అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. వీటికితోడు ఏటేటా అకాల వర్షాలు అన్నదాతలకు అంతులేని కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వడ్లు వెల్లువలా తరలివస్తున్నా కొనుగోలు చేసేవారు కరువయ్యారు. ఈ క్రమంలో కేంద్రాల్లో పోసిన ధాన్యం అకాల వర్షాలకు తడుస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండుసార్లు అకాల వర్షం
ఈనెల 3, 10 తేదీల్లో జిల్లాలో రెండుసార్లు అకాల వర్షం కురిసింది. 3న కురిసిన వర్షంతో తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో 139 మంది రైతులకు చెందిన వరి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. 160 ఎకరాల మామిడి, 60 ఎకరాల వరిపంట దెబ్బతిన్నట్లు అధికారులే లెక్కకట్టారు. కాగా 10వ తేదీన కురిసిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోగా, కోతకు సిద్ధంగా ఉన్న వరిపైర్లు నేలవాలాయి. కొన్నిచోట్ల ధాన్యం రాలింది. జిల్లాలోని నాన్‌ఆయకట్టులో వరికోతలు తుది దశకు చేరుకోగా, మూసీ ఆయకట్టులో వరికోతలు జోరందుకున్నాయి.
ఇదీ..పరిస్థితి!
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా కొనుగోళ్లు వేగం పుంజుకోలేదు. దీనికితోడు మిల్ల ర్లకు ధాన్యం కేటాయించలేదు. కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయశాఖ అధికారులు తేమ శాతం కూడా చూసిందిలేదు. మిల్లులకు ధాన్యం తరలించే లారీల కేటాయింపు పూర్తి కాలేదు. కొనుగోలును ఎంట్రీ చేసే ట్యాబ్‌లు ఇంకా అందుబాటులోకి రాలేదు. అక్కడక్కడా అరకొరగా కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే ఇటీవల కురిసిన అకాల వర్షాలతో ఽరైతుల ధాన్యం కొంత తడవగా, మరికొంత కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని అరబెట్టడం, కుప్పపోయడంతోనే సరిపోతుందని, కొనుగోలు చేయడం లేదని రైతులు అంటున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
ఇప్పటి వరకు
ప్రారంభించినవి
92
నిర్ణయించిన
కొనుగోలు కేంద్రాలు
323
కొనుగోలు కేంద్రాలకు
వెల్లువలా ధాన్యం
ఖరారుకాని మిల్లుల ట్యాగ్
తేమ శాతం చూసేవారే కరువు
నత్తనడకన సాగుతున్న కొనుగోళ్లు
అకాల వర్షాలతో వడ్లు వర్షార్పణం
కన్నీరుమున్నీరవుతున్న రైతాంగం
కొనుగోలు చేసిన ధాన్యం
242 మెట్రిక్ టన్నులు
ఐదు క్వింటాళ్ల వడ్లు చెరువుపాలు
ఇరవై రోజుల క్రితం 500 బస్తాల వడ్లను గుండాల బండమీద రాశిగా పోశా ను. రెండుసార్లు అకాల వర్షం కురిసింది. దీంతో వడ్లు తడవడమే కాకుండా సుమారు ఐదు క్వింటాళ్ల వడ్లు బండ కింద ఉన్న రామసముద్రం చెరువులోకి కొట్టుకుపోయాయి. రోజూ ఆరబెట్టి కుప్పపోస్తున్నా. రంగు మారితే కొంటారో లేదోనని భయంగా ఉంది. వెంటనే కొనుగోలు చేయాలి.
– దేవనబోయిన మంజుల రైతు, గుండాల
కొనుగోలు లక్ష్యం
4.50 లక్షల మెట్రిక్ టన్నులు

రైతన్నలకు అకాల కష్టం