
బాధితులకు న్యాయం చేస్తాం
యాదగిరిగుట్ట రూరల్: మండలంలోని జంగంపల్లి గ్రామంలో పహాణీల్లో పేర్లు మార్పుల వల్ల భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తామని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి గ్రామంలో పహాణీల్లో పేర్లు మార్చి భూములను తొలగించిన కారోబార్‌పై గత నెల 22న సాక్షి దినపత్రికలో ప్రచురించిన కబ్జాల కారోబార్ కథనానికి యంత్రాంగం స్పందించింది. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ కృష్ణారెడ్డి శుక్రవారం గుట్ట తహసీల్దార్ కార్యాలయంలో విచారణ కమిటీలోని సభ్యులైన ఆర్‌ఐలు విజయసింహారెడ్డి, శ్రీకాంత్, సర్వేయర్లతో సమావేశమై మాట్లాడారు. పహాణీలో మార్పుల జరిగిన భూముల వివరాలు క్షేత్ర స్ధాయిలో విచారణ చేయాలన్నారు. కాలువల పేరుతో భూములను తొలగించి, వాటిల్లో కాలువ పోకుండా ఉన్న భూములను పరిశీలించాలన్నారు. నిబంధలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు కూడా ఉంటాయన్నారు. రైతులు అధైర్యపడవద్దని, అసైన్‌డ్ భూములు ఎవరు అమ్మినా కొన్నా కఠిన చర్యలుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డీటీ సత్యనారాయణ, ఆర్‌ఐలు, సీనియర్ అసిస్టెంట్ రాము త దితరులు ఉన్నారు.
భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి
‘కబ్జాల కారోబార్’ వ్యవహారంపై విచారణ చేయాలని ఆదేశం

బాధితులకు న్యాయం చేస్తాం