
ముంపు లేకుండా గంధమల్ల
1.41 టీఎంసీల సామర్థ ్యంతో రిజర్వాయర్ నిర్మాణం.. పాలనా ఆమోదం తెలిపిన ప్రభుత్వం
సాక్షి, యాదాద్రి : ఆలేరు నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల సాకారం కానుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గంధమల్ల రిజర్వాయర్‌కు పరిపాలనా ఆమోదం లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వ రం ప్రాజెక్టు ప్యాకేజీ –15లో భాగంగా ప్రతిపాదించిన ఈ రిజర్వాయర్‌ను.. ముంపు సమస్య లేకుండా, తక్కువ భూసేకరణతో నిర్మించనున్నారు.
రిజర్వాయర్ సామర్థ్యం రెండు దఫాలు కుదింపు
తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువును రిజర్వాయర్ చేయాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. జలాశయాన్ని 9.86 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.800 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ రూపొందించింది. ఈ రిజర్వాయర్ ద్వారా ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో 68 వేల ఎకరాలకు సాగు నీరందించాలన్నది లక్ష్యం. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. బెకమ్, నవయుగ, ప్రసాద్ సంస్థలు కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి. అయితే రిజ ర్వాయర్ నిర్మాణంలో ఐదు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇందులో వీరారెడ్డిపల్లి పూర్తిగా, గంధమల్ల, భీమరిగూడెం, ఇందిరానగర్ పాక్షికంగా ముంపునకు గురవుతున్నాయి. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంతేకాకుండా 4,027 (అటవీ భూములు 230ఎకరాలు కలుపుకుని) ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇది అధికారులకు సవాల్‌గా మారింది. దీంతో పాటు ముంపు ప్రాంతాల గుండా 400 కేవీ హైటెన్షన్ విద్యుత్ టవర్లు ఉండడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పవర్‌గ్రిడ్ అధికారులు ప్రభుత్వానికి వివరించారు. సాంకేతిక కమిటీ సూచన మేరకు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.28 టీఎంసీలకు కుదించింది. అయినా మూడు గ్రామాలు ముంపునకు గురవుతుండడం, 2,094 ఎకరాల భూమి సేకరించాల్సి వస్తుంది. ముంపు గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం మరోసారి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీలకు తగ్గించింది.
రూ.574.56 కోట్లు మంజూరు
పాత కాంట్రాక్టు సంస్థలకే
పనులు అప్పగింత
భూసేకరణకు సిద్ధమవుతున్న రెవెన్యూ, నీటిపారుదల శాఖ
ప్రాజెక్టు పూర్తయితే 68 వేల
ఎకరాలకు సాగు నీరు
మాట నిలుపుకున్నాం
గంధమల్ల రిజర్వాయర్ నిర్మిస్తామని ఎన్నికల ప్రచా రంలో హామీ ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకుంది. వీలైనంత త్వరలో రిజర్వాయర్ పనులు పూర్తి చేసి గోదావరి జలాలతో ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం. ముంపు బాధలేకుండా రిజర్వాయర్ పనులకు పరిపాలనామోదం తెలిపినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు.
–బీర్ల అయిలయ్య,
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే
1.41 టీఎంసీలతో నిర్మాణం
1.41 టీఎంసీల సామర్థ్యంతో గంధమల్ల రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకోసం రూ.574.56 కోట్లు మంజూరు చేసింది. రిజర్వాయర్ కోసం గంధమల్ల, వీరారెడ్డిపల్లి రెవెన్యూ పరిఽధిలో సుమారు వెయ్యి ఎకరాలు సేకరించాల్సి వుంది. ఇందులో రిజర్వు పారెస్ట్ నుంచి 239 ఎకరాలు తీసుకోనున్నారు. దీనికి బదులు వరంగల్ జిల్లాలో ప్రభుత్వం భూమిని అటవీశాఖకు కేటాయించింది. ప్రాజెక్టుకు పరిపాలన ఆమోదం లభించడంతో భూసేకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టెండర్లు దక్కించుకున్న బెకమ్, నవయుగ, ప్రసాద్ సంస్థలు సంయుక్తంగా రిజర్వాయర్ పనులు చేపట్టనున్నాయి.

ముంపు లేకుండా గంధమల్ల