
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చౌటుప్పల్ : రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ పదవీ ప్రమాణస్వీకా రోత్సం ఆదివారంఅట్టహాసంగా జరిగింది.ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. నూతన చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్లతో మార్కెట్ కార్యదర్శి రవీందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 20 శాతం నిధులు వ్యవసాయానికి కేటా యించి చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు. ఏడాదిన్నర కాలంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. చౌటుప్పల్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ అభివృద్ధికి నిధులు తీసుకువస్తానన్నారు. చౌటుప్పల్ ప్రాంతంలోని మూసీ కాలువల్లో కృష్ణా, గోదావరి జలాలను పారించడమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించే బాధ్యత తనదేనన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమం, వ్యవసాయం బాగుండాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.రాజకీయాల్లో రాజగోపాల్‌రెడ్డి తనకు స్ఫూర్తి అని, ఆయనకు మంత్రి పదవి లభిస్తే చౌటుప్పల్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి నాయకత్వంలో చౌటుప్పల్ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. నూతన పాలకవర్గం రైతులకు చేరువై సేవలందించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, తాడూరి వెంకట్‌రెడ్డి, చిక్కా నర్సింహ, గుత్తా ఉమాదేవి, నూతి రమేష్‌రాజు, అందెల లింగంయాదవ్, నారబోయిన రవి, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మార్కెట్ సెక్రటరీ రవీందర్‌రెడ్డి, నాయకులు పబ్బు రాజుగౌడ్, పాశం సంజయ్‌బాబు, చెన్నగోని అంజయ్యగౌడ్, ఉప్పు భద్రయ్య, కొయ్యడ సైదులుగౌడ్, మొగుదాల రమేష్, సుర్వి నర్సింహ, బోయ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి