
అంబేడ్కర్‌కు ప్రముఖుల నివాళి
సాక్షి, యాదాద్రి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను సోమవారం భువనగిరిలోని వినాయక చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సీ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ అక్షాంక్ష్ యాదవ్, అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జినుకుల శ్యాంసుందర్ తదితర ప్రముఖులు హాజరై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రపంచం గర్హించదగిన మేధావి అంబేడ్కర్ :
ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
ప్రపంచం గర్హించదగిన మేధావి బాబాసాహెబ్ అంబేడ్కర్ అని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. తాను రచించిన రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు వజ్రాయుధం లాంటి ఓటు హక్కు కల్పించారని పేర్కొన్నారు. అంతేకాకుండా అన్ని వర్గాలు సమాన విద్య, సమాన హక్కులు, ప్రాథమిక హక్కులు పొందగలుగుతున్నాయంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లేనన్నారు. అంబేడ్కర్‌ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, ఉద్యోగ జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావుతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, దళిత, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
భారీ ర్యాలీ : మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో భువనగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు.

అంబేడ్కర్‌కు ప్రముఖుల నివాళి