ౖరెతులకు తిప్పలు! | - | Sakshi
Sakshi News home page

ౖరెతులకు తిప్పలు!

Apr 15 2025 1:41 AM | Updated on Apr 15 2025 1:41 AM

ౖరెతు

ౖరెతులకు తిప్పలు!

వారి తప్పులు..

సాక్షి, యాదాద్రి : రేషన్‌ కార్డ్‌ ఎడిట్‌, ఆధార్‌, బ్యాంకు ఖాతాల్లో తప్పిదాల వంటి సాంకేతిక సమస్యలు వేలాది మంది రైతులను రుణమాఫీకి దూరం చేసింది. ఇంకా 30 శాతం మంది రైతులు అర్హతలున్నా రుణమాఫీ పొందలేదు. డిసెంబర్‌లో జరిగిన నాలుగో విడతలోనూ ఉపశమనం లభించకపోవడంతో.. వీరంతా తమ రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజావాణిలో అర్జీలు సమర్పిస్తున్నారు.

నాలుగు విడతల్లో 80,962 మందికి మాఫీ

రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతులందరికీ రూ.2 లక్షల్లోపు పంట రుణాలను మాఫీ చేసింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు విడతల్లో 80,962 మంది రైతులకు రూ.669.73 కోట్లు హాపీ అయ్యాయి. తొలి విడతలో రూ.లక్ష లోపు రుణాలు 36,483 మందికి 199.46, రెండో విడతలో రూ.లక్షన్నర లోపు 19,798 మందికి రూ.193.96 కోట్లు, మూడో విడతలో రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షల వరకు 13,011 మందికి రూ.164.66 కోట్లు మాఫీ జరిగింది. నాలుగో విడతలో 11,690 మంది రైతులు రూ.111.65 కోట్లు లబ్ధి పొందారు. ఇంకా 30 శాతం మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు.

మాఫీ వర్తించకపోవడానికి కారణాలివీ..

సాంకేతిక సమస్యలకు తోడు మానవ తప్పిదాలను సరిదిద్దాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో వేలాది మంది రైతులు రుణమాఫీకి దూరం చేసింది. రేషన్‌ కార్డ్‌ ఎడిట్‌, ఆధార్‌, బ్యాంకు ఖాతాల్లో పేర్లు, నంబర్లలో తప్పులు దొర్లడం, ఫోన్‌ నంబర్లు సరిపోలకపోవడం, ఖాతాలు క్లోజ్‌ చేయడం వంటి కారణాలతో చాలా మంది రైతుల పేర్లు రుణమాఫీ జాబితాలో రాలేదు. వీరంతా కలెక్టరేట్‌, రైతువేదికలు, వ్యవసాయ కార్యాలయాలు, పీఏసీఏసీల్లో ఏర్పాటు చేసిన హెల్స్‌డెస్క్‌లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌ సెల్‌లలో ప్రభుత్వ సూచన మేరకు దరఖాస్తు చేసుకున్నారు. 4,300కు పైగానే దరఖాస్తులు వచ్చాయి. జిల్లా అధికారులు వీటిని పరిశీలించి ఉన్నతస్థాయికి పంపారు. ఇటువంటి వారికి నాలుగో విడతలో రుణమాఫీ చేశారు. కానీ, చాలా మంది పేర్లు జా బితాలో రాలేదు. ప్రధానంగా ఏపీజీవీబీ, పీఏసీఎస్‌, డీసీసీబీ, వాణిజ్య బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకుల్లో కొత్త రుణాలు తీసుకునే పరిస్థితి లేకుండాపోయింది. వానాకాలం వరకై నా సమస్యను పరిష్కరించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

పేరువచ్చినా డబ్బులు జమ కాలేదు

నాలుగో విడతలో రుణమాఫీ అయిందని జాబితాలో పేరు వచ్చింది. కానీ, బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాలేదు. ఆంధ్రప్రదేశ్‌ గ్రా మీణ వికాస్‌ బ్యాంకు పేరు తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్చడంతో టెక్నికల్‌గా సమస్య ఏర్పడినట్లు చెబుతున్నారు. నాతో పాటు చాలా మంది రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారులు చొరవ చూపి సమస్య పరిష్కరించాలి.

–చిలువేరు రాజమల్లారెడ్డి, బొమ్మలరామరాం

సాంకేతిక సమస్యలను సరిచేయని అధికారులు

అర్హతలున్నా వర్తించని రుణమాఫీ

జిల్లాలో ఇంకా 30 శాతం

మంది ఎదురుచూపులు

కొత్త రుణాలు ఇచ్చేందుకు

నిరాకరిస్తున్న బ్యాంకులు

ప్రజావాణిలో వినతిపత్రాలు

అందజేస్తున్న రైతులు

అధికారుల చుట్టూ తిరుగుతున్నా

ఆలేరులోని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో రూ.70 వేలు పంట రుణం తీసుకున్నా. మొదటి విడుతలోనే రుణమాఫీ జాబితాలో నా పేరు వచ్చింది. ఖాతాలో డబ్బు కూడా జమ అయింది. అయినా బ్యాంకు అధికారులు కొత్త రుణం ఇవ్వడం లేదు. కారణం అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. రుణం కోసం బ్యాంకు చుట్టు తిరుగుతున్నా.

– ఎన్‌. చంద్రారెడ్డి, బహుద్దూర్‌పేట

ౖరెతులకు తిప్పలు!1
1/2

ౖరెతులకు తిప్పలు!

ౖరెతులకు తిప్పలు!2
2/2

ౖరెతులకు తిప్పలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement