
వేసవిలో అప్రమత్తంగా ఉండాలి
భువనగిరి : వేసవిలో అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ మనోహర్ సూచించారు. అసంక్రమిత వ్యాధులు, రెబీస్ నివారణ, వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెడికల్ ఆపీసర్లు, ఎంఎల్‌హెచ్‌పీలకు కలెక్టరేట్‌లో గురువారం శిక్షణ ఇచ్చారు. ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, ఎండకు బయటకు వెళ్లిన వారు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉప్పు, చక్కెర స్థాయికి మించి తీసుకోవడం వల్లే మధుమేహం వస్తుందని, వ్యాధిగ్రస్తులు జొన్న, చిరుధాన్యాలు తీసుకోవాలన్నారు. సిగరెట్లు, బీడీలు తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటుకు సంబంధించిన రెబీస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. అనంతరం అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అదే విధంగా హిమోఫిలియో దినోత్సవం సందర్భంగా హిమోఫిలియోపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ యధోద, డాక్టర్లు సత్యేంద్రనాథ్, అనిల్, అశ్విన్‌కుమార్, హేమంత్‌కుమార్, సుమన్‌కళ్యాణ్, శిల్పిని, రామకృష్ణ, సాయిశోభ, వీణ, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.
ఫ డీఎంహెచ్‌ఓ మనోహర్