
వాగులను తోడేస్తున్నారు!
జోరుగా ఇసుక అక్రమ రవాణా
ధర్మారెడ్డిగూడెం టు
కాచారం, హైదరాబాద్
యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం పరిధిలోని వాగు నుంచి రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తూ అక్రమ దందా సాగిస్తున్నారు. రాత్రి సమయంలో అక్రమార్కులు జేసీబీల ద్వారా ఇసుక తోడి కాచారం ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.3 వేలకు అమ్ముతున్నారు. రోజూ సుమారు 30 ట్రాక్టర్ల ఇసుక తరలిస్తున్నారు. వాగు వెంట ఉన్న రైతులు, గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అదే విధంగా సైదాపురం–మాసాయి పేట, మైలార్‌గూడెంను కలుపుతూ వలిగొండ చెరువు వరకు ఉన్న వాగు రూపురేఖలు లేకుండాపోయింది. వాగులో ఇసుక తరలించడంతో పాటు పరీవాహకంలో అక్రమార్కులు ఫిల్టర్ ఇసుక కూడా తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఫ ఇందిరమ్మ ఇళ్లు, అభివృద్ధి పేరిట దందా ఫ ట్రాక్టర్ రూ.3000 వరకు విక్రయం
ఫ లారీల్లో హైదరాబాద్‌కు తరలింపు ఫ మొక్కుబడిగా తనిఖీలు
ఇసుక అక్రమ రవాణాకు అడ్డులేకుండాపోతోంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్లను అవకాశంగా మలుచుకుని అక్రమార్కులు దందా సాగిస్తున్నారు. వాగులనుంచి ట్రాక్టర్ల ద్వారా రహస్య ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి లారీలు, టిప్పర్ల ద్వారా హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ప్రధానంగా ఆలేరు, యాదగిరిగుట్ట, ఆత్మకూర్(ఎం), అడ్డగూడూరు, రాజాపేట మండలాల్లో విస్తరించిన వాగులను అక్రమార్కులు టార్గెట్ చేస్తున్నారు.ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక దందా సాగుతున్నా సంబంధిత అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు.
–యాదగిరిగుట్ట రూరల్, ఆలేరు రూరల్, రాజాపేట

వాగులను తోడేస్తున్నారు!

వాగులను తోడేస్తున్నారు!

వాగులను తోడేస్తున్నారు!