
అధికారుల అండదండలతోనే..
ఆలేరు మండలం కొలనుపాక, రాజనగరం, ధర్మారెడ్డిగుడెం, మంతపురి, సాయిగుడెం, తూర్పుగుడెం, గొలనుకొండ వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల సాకుతో అక్రమార్కులు ఇసుక దందా సాగిస్తున్నారు. రెండుమూడు డీడీలు తీసి పది ట్రాక్టర్ల వరకు ఇసుక తరలిస్తున్నారు. రహస్యప్రాంతాల్లో డంప్ చేసి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌కు లారీల్లో చేరవేస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.5వేల నుంచి రూ.6వేల వరకు విక్రయిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు, పోలీసులు, రెవెన్యూ అధికారుల అండదండలతోనే అక్రమ దందా సాగుతున్నట్లు విమర్శలున్నాయి. అక్రమార్కులు తమ సంపాదనంలో నెలనెలా వారికి కొంత ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది.