
శుభవార్త చర్చి వార్షికోత్సవాలు ప్రారంభం
మఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవాలను గురువారం సాయంత్రం ఫాదర్ మార్టిన్ ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం చర్చిలో జరిగే దివ్యబలి పూజలకు నల్లగొండ మేత్రాసన పీఠాదిపతి దమన్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై సందేశమిస్తారన్నారు. అదేవిధంగా సాయంత్రం మేరీమాత ప్రతిమతో పురవీధుల్లో ఊరేగింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఫాదర్ అల్లం బాల, చర్చి కమిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఎద్దుల పందేలకు ఏర్పాట్లు పూర్తి
శుభవార్త చర్చి వార్షికోత్సవాలను పురస్కరించుకుని స్థానిక శుభోదయ యువజన సంఘం, చర్చి కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29 వరకు నిర్వహించనున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పందేలకు స్థానిక మాంట్‌ఫోర్డ్ స్కూల్ మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఎద్దుల పందేలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ప్రారంభిస్తారని యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్‌రెడ్డి న్నారు.

శుభవార్త చర్చి వార్షికోత్సవాలు ప్రారంభం