
ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
సాక్షి,యాదాద్రి : తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్, నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ కమిటీ, ఇండియన్ పౌల్ట్రీ ఎక్యూప్‌మెంట్ మాన్యుఫాక్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్లెక్సీకి పాలభిషేకం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా కాంట్రాక్టర్ల ద్వారా కుండా పౌల్ట్రీ యజమానుల ద్వారా జరగాలని సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. పౌల్ట్రీ రైతులను ఆదుకోవడానికి ముందుకువచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు కాసర్ల మోహన్‌రెడ్డి, పౌల్ట్రీ ఇండియా ఫౌండర్ అనిల్‌ధుమాల్, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, జనరల్ సెక్రటరీ భాస్కర్‌రావు, పౌల్ట్రీ ఇండియా డైరెక్టర్ పొట్లూరి చక్రధర్‌రావు, పౌల్ట్రీ రైతులు పాల్గొన్నారు.