
యాదగిరి క్షేత్రంలో ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు.సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం చేపట్టారు.అంతకుముందు ప్రధానాలయంలో నిత్యపూజా కార్యక్రమాలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చన చేశారు. ఇక ప్రాకార మండపపం, ముఖ మండపంలో సుదర్శనహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం నిర్వహించారు.