
28న ప్రజావాణి రద్దు
భువనగిరిటౌన్ : కలెక్టరేట్‌లో ఈనెల 28వ తేదీన జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భూ భారతి చట్టంపై గ్రామాల్లో నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో ఉన్నతాధికారులు పాల్గొంటారని, ఈ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు గమనించి సమస్యలపై వినతులు అందజసేందుకు కలెక్టరేట్‌కు రావద్దని, అధికారులకు సహకరించాలని కోరారు.
కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి బియ్యం
సాక్షి, యాదాద్రి : కొత్తరేషన్ కార్డుదారులకు మే నెల నుంచి సన్న బియ్యం పంపి ణీ చేస్తామని అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరారెడ్డి తెలిపారు. శనివారం ఆయన తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈనెలలో కొత్తగా 419 రేషన్ కార్డులు మంజూ రయ్యాయని, వీటిపై 30,188 యూనిట్లకు బియ్యం సరఫరా చేస్తామన్నారు. ఏప్రిల్ నెలలో 2,16, 904 కార్డులకు గాను 6,76,188 యూ నిట్ల (లబ్ధిదారులకు) బియ్యం ఇచ్చామన్నారు. మే నెలనుంచి పెరిగిన వాటితో కలిపి 2,17,323 కార్డులకు 7,06,368 యూనిట్ల బియ్యం సరఫరా చేస్తామన్నారు.
బొమ్మలరామారం నిప్పులకొలిమి
భువనగిరిటౌన్ : జిల్లాలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం బొమ్మలరామారం మండలంలో ఏకంగా 44.1 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరింది. గత పదేళ్లలో ఏప్రిల్ నెలలో ఈస్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదటిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మిగతా మండలాల్లోనూ 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. రానున్న మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ బదిలీ
భువనగిరి : జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం వైద్యారోగ్య శాఖనుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రాజారావు 8 నెలల కిత్రం ఇక్కడికి వచ్చారు. ఆయన స్థానంలో ఆర్థోపెడిక్ సర్జరీగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వెంకటేశ్వర్లకు ఇంచార్జ్‌గా బాధ్యతలు స్వీకరించారు. వెంకటేశ్వర్లను డాక్టర్ రాజారావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రమేష్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌రావు, డీసీహెచ్‌ఎస్ చిన్ననాయక్ సన్మానించారు.

28న ప్రజావాణి రద్దు

28న ప్రజావాణి రద్దు