వేగంగా వెళుతున్న వాహనంలో మంటలు
గుర్రంకొండ : వేగంగా రోడ్డుపై వెళుతున్న బొలేరో వాహనంలోఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పి, వాహనం ముందు భాగం మొత్తం కాలిపోయిన సంఘటన మండల కేంద్రమైన గుర్రంకొండలో జరిగింది. పెద్దమండ్యం మండలానికి చెందిన రెడ్డెయ్య అనే వ్యక్తి టమాటా లోడుతో గురువారం కలకడ టమాటా మార్కెట్‌కు బయలుదేరాడు. మార్గమధ్యంలో గుర్రంకొండకు సమీపంలోని శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం వద్ద బొలేరో వాహనం ముందుభాగం ఇంజిన్ వైపు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో డ్రైవర్ రెడ్డెయ్య ఉక్కిరిబిక్కిరి అయిపోయి వెంటనే వాహనం నిలిపేసి దిగిపోయాడు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడి వాహనం ముందుభాగం మొత్తం కాలిపోయింది. వాహనంలోని ఇంజిన్ భాగంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. జరిగిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment