●వైఎస్ జగన్ హయాంలో మెరుగైన వైద్య సేవలు
కడప అగ్రికల్చర్: అత్యవసర సేవలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. దీంతో జిల్లాలో 1962 హెల్ప్‌లైన్ మూగబోనుంది. మారుమూల గ్రామాల్లోని పశు వైద్యానికి గ్రహణం పట్టనుంది. పశువులకు సైతం అత్యవసర వైద్యం అందించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార వైద్య సేవలకు మంగళం పాడింది, ఉన్నఫళంగా ఆరోగ్య సేవలు నిలిపేసి ఉద్యోగులను వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా జిల్లావ్యాప్తంగా మొదటి విడుదతలో వచ్చిన నియోజకవర్గానికి ఒకటి చొప్పున వచ్చిన 7 సంచార పశు వైద్య వాహనాలు ఆగిపోయాయి. ఫేజ్–1లో వాహనాలు తిరిగి ఆయా పశు వైద్యశాఖ ఏడీ కార్యాలయాల్లో అప్పగించి తమకు రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో వాటిలో పనిచేసే పైలట్, డాక్టర్లను విధులకు హాజరుకావద్దని వాట్సాప్ మేసేజ్ ద్వారా సూచించారు.
● ప్రస్తుతం మొదటి విడతకు సంబంధించిన ఏడు సంచార పశు వైద్య అంబులెన్స్‌లను ఆపేశారు. ఇందులో కడప, కమలాపురం, జమ్మలమడుగు నియోజక వర్గాలకు సంబంధించిన వాహనాలను ఆయా ఏడీ కార్యాలయాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా బద్వేల్, పులివెందుల, పొద్దుటూరు, మైదుకూరు నియోజక వర్గాలకు చెందిన వాహనాలను స్వాధీనం చేసుకోనున్నారు. త్వరలో రెండో విడతకు సంబంధించి మరో 6 సంచార పశు వైద్యవాహనాల సేవలను కూడా ఆపేయనున్నట్లు తెలిసింది. ఇవి కూడా ఆగిపోతే గ్రామాల్లో సంచార పశు వైద్య సేవలు అగిపోనున్నాయి. దీంతో మూగ జీవాలు, పశు పోషకులు ఆందోళన చెందుతున్నాయి.
పశుపోషకుల ఇంటి ముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బృహత్తర కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ నియోజక వర్గానికి రెండు చొప్పన అంబులెన్సులను మంజూరు చేశా రు. ఇందులో భాగంగా వైఎస్సార్‌జిల్లాకు 2022 మే నెలలో మొదటి విడతతో 7 సంచార పశువుల అంబులెన్స్‌ను, 2023 ఏప్రిల్ నెలలో మరో ఆరింటిని మంజూరు చేశారు. వీటి ద్వారా సేవలు పొందేందుకు ప్రత్యేకంగా 1962 అనే టోల్ ఫ్రీ నంబర్ సైతం ఏర్పాటు చేసి సేవలను ప్రారంభించారు.
ఫోన్ చేస్తే చాలు..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన పశు సంచార అంబులెన్స్‌కు సంబంధించిన 1962 టో ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి పశువు ఆరోగ్య సమస్యను వివరిస్తే చాలు నిమిషాల వ్యవధిలో అంబులెన్స్ రైతు ముంగిటకు వచ్చేది. మెరుగైన వైద్య సేవలు అందించాల్సి వస్తే సమీపంలోని ఏరియా పశు వైద్యశాల, వెటర్నీరీ పాలీక్లినిక్‌కు తరలించి చికిత్స అందించి తిరిగి ఆ పశువును సురక్షితంగా రైతు ఇంటికి చేర్చేవారు. సేవలు ప్రారంభించిన మూడేళ్లలో వేల సంఖ్యలో పశువులకు వైద్య సేవలందించి అందరి మన్ననలు పొందారు. అంతటి ప్రాధాన్యం సంతరించుకున్న వాహనాలను కూటమి ప్రభుత్వం ఉన్నఫళంగా ఆపేయడంతో రైతులు అందోళన చెందుతున్నారు.
ప్రభత్వు ఉత్తర్వుల మేరకు..
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మొదటి విడతలో భాగంగా కడప, కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాలకు సంబంధించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. మిగతా నాలుగింటిని కూడా త్వరలో స్వాధీనం చేసుకుంటాం.
– డాక్టర్ శారదమ్మ,
జాయింట్ డైరెక్టర్, జిల్లా పశుసంవర్ధకశాఖ
1962 అంబులెన్స్‌లపై కూటమి కక్ష
జిల్లాలో మొదటి విడత మొబైల్ అంబులెన్స్ సేవలు నిలిపివేత
కూటమి ప్రభుత్వం తీరుపై పాడి రైతుల ఆగ్రహం
●వైఎస్ జగన్ హయాంలో మెరుగైన వైద్య సేవలు
●వైఎస్ జగన్ హయాంలో మెరుగైన వైద్య సేవలు
●వైఎస్ జగన్ హయాంలో మెరుగైన వైద్య సేవలు
Comments
Please login to add a commentAdd a comment