నేడు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలతో ఈనెల 22వ తేదీ డీఈఓ కార్యాలయంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈఓ డాక్టర్ షేక్ షంషుద్దీన్ తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి జిల్లాలో ఉన్న ప్రతి ఉపాద్యాయ సంఘం నుంచి జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి తప్పకుండా హాజరుకావాలని కోరారు.
24న గండిలో టెండర్లు
చక్రాయపేట: జిల్లాలోని గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో ఈనెల 24న తలనీలాలు,ఒక భాగం కొబ్బరి చిప్పలు సేకరించే హక్కు కల్పించడానికి ఇ–టెండర్, షీల్డ్ టెండర్, బహిరంగ వేలంపాటను 3వ పర్యాయం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య శుక్రవారం తెలిపారు. గతం లో రెండు మార్లు టెండర్లు నిర్వహించినా సరైన ధర రానందున టెండర్లు రద్దు చేశామన్నారు. సోమవారం జరిగే టెండర్లలో పాల్గొనేవారు తలనీలాలకు రు.25లక్షలు,కొబ్బరి చిప్పలకు రు.3లక్షలు డిపాజిట్ చెల్లించాలని తెలిపారు.పూర్తి వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.
రైతు బజార్‌లో టమాటా
విక్రయాలకు అనుమతి
కడప అగ్రికల్చర్: జిల్లాలో టమాటా రైతులకు పంట ఉండి ఎటువంటి గుర్తింపు కార్డు లేకపోయినా రైతు బజార్‌లో సరుకులు అమ్మకాలు చేయడానికి ప్రభుత్వం అనుమతి కల్పించిందని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. కూరగాయల పంట సీజన్ అయినందున ఎక్కవ సంఖ్యలో సరుకు దిగుబడి రావడంతో గ్రామాల్లో తగినంత ధర రాకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. అయితే వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ వారు రైతులు తమ సరుకును నేరుగా తీసుకుని తమ పరిధిలోని రైతు బజార్లలో అమ్మకునేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఈ విషయలో సందేహాలు ఉంటే జిల్లా సహాయ కేంద్రం 87126 44814,08562–246344, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ 8074723702 నంబర్లలో సంప్రదించాలని జేసీ తెలిపారు.
హుండీ ఆదాయం లెక్కింపు
లక్కిరెడ్డిపల్లి: అనంతపురం గంగమ్మ ఆల యంలో దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ శివయ్య ఆధ్వర్యంలో శుక్రవారం హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. రూ. 4,29, 680 వచ్చినట్లు ఆలయ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ నగదును ఆలయ ఖాతాకు జమచేస్తామని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పూజారులు చెల్లు గంగరాజు, దినేష్ కుమార్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
మార్చి 6న ‘చలో విజయవాడ’
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: మున్సిపల్ విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మార్చి 6న తల పెట్టిన చలో విజయవాడను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కెసీ బాదుల్లా పేర్కొన్నారు. శుక్రవారం కడపలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆప్కాస్‌ను రద్దుపరిస్తే కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని మళ్లీ ప్రైవేటు బడా కంపెనీలకు,ఏజెన్సీలకు అప్పచెబుదామన్న మంత్రివర్గ సభ్యుల అభిప్రాయాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మున్సిపల్ కార్మికుల సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించుకోవడానికి పోరాటానికి కార్మికుల సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పర్మినెంట్ కార్మికులకు మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ లో ఎన్‌క్యాస్‌మెంట్, మూడు డీఏలు సత్వరం విడుదల చేయాలన్నారు. ఈ నెల 24న కడప నగరపాలక సంస్థ కార్యాలయం, మార్చి 3న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన, ధర్నాలు చేపడతామన్నారు.మార్చి 6న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్ల్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఈశ్వరయ్య, జాన్, వెంకటాద్రి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం
Comments
Please login to add a commentAdd a comment