ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్
బద్వేలు అర్బన్: ప్రజాప్రతినిధులకు కనీస మర్యాద ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సుధ మున్సిపల్ అధికారులను హెచ్చరించారు. స్థానిక ఎన్‌జీవో కాలనీలోని మున్సిపల్ కార్యాలయ సభా భవనంలో శుక్రవారం మున్సిపల్ చైర్మన్ వాకమళ్ళరాజగోపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి ఆయా వార్డుల్లో పర్యటనకు వెళుతున్నప్పుడు సంబంధిత వార్డు కౌన్సిలర్లకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వారిని అవమానపరుస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. అధికార పార్టీ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో ఒకలా, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో మరోలా వ్యవహరించడం సరికాదన్నారు. సమావేశ అజెండాలో తనకు, ఎమ్మెల్సీకి ఆహ్వానం పంపినట్లు పొందుపరచకపోవడం సరికాదని అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గత సమావేశాల్లో సభ్యులు ఏ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు, వాటిని ఏ మేరకు పరిష్కరించారు అనే దానిపై తప్పనిసరిగా సమీక్ష జరగాలని సూచించారు. అధికారులు రాజకీయాలతో సంబంధం లేకుండా వ్యవహరించాలని కోరారు.మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ భావనారాయణనగర్‌లో వంక పోరంబోకులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని గతంలో ఫిర్యాదు చేసినా ఇంత వరకు ఎందుకు పట్టించుకోలేదని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. అలాగే ఆహ్వానం ఉండి సమావేశానికి హాజరు కాని అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని కమిషనర్‌కు సూచించారు. ముఖ్యంగా కొన్ని వార్డుల్లో సచివాలయ సిబ్బంది ఏవైనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వార్డు కౌన్సిలర్లకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని, ఇటువంటి పద్దతులు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
ఎమ్మెల్యే డాక్టర్ సుధ
మున్సిపల్ కమిషనర్ తీరుపై ఎమ్మెల్యే సీరియస్
కనీస మర్యాద ఇవ్వడం లేదంటూ కౌన్సిలర్లు సైతం ఆగ్రహం
ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్
Comments
Please login to add a commentAdd a comment