మహాశివరాత్రికి 317 ప్రత్యేక బస్సులు
కడప కోటిరెడ్డిసర్కిల్: మహాశివరాత్రిని పురస్కరించుకుని కడప రీజియన్ వ్యాప్తంగా వివిధ శైవ క్షేత్రాలకు 317 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆర్‌ఎం కార్యాలయంలో డిప్యూటీ సీఎంఈ, డిపో మేనేజర్లు, ట్రాఫిక్ సూపర్‌వైజర్లు, మెకానికల్ సూపర్‌వైజర్లతో మహాశివరాత్రి ఉత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లు గురించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ పొలతలకు 78 బస్సులు, నిత్యపూజకోన 40, శ్రీశైలం 2, రాయచోటి నుంచి పొలతలకు 40, పులివెందుల నుంచి పొలతలకు 27, భానుకోటకు 3, బద్వేలు నుంచి లంకమలకు 25, బి.మఠానికి 5, మల్లెంకొండకు 12, పోరుమామిళ్ల నుంచి ఎన్‌ఎస్ మఠానికి 3, మైదుకూరు నుంచి లంకమలకు 15, జ్యోతి (సావిశెట్టిపల్లె)కి 2, పోరుమామిళ్ల జ్యోతికి 6, బి.మఠానికి 15, ప్రొద్దుటూరు నుంచి పొలతలకు 15, ఎర్రగుంట్ల సంగమేశ్వర దేవళాలు 4, అల్లాడుపల్లె దేవళాలు 10, కన్యతీర్థం 6, జమ్మలమడుగు నుంచి అగస్తశ్వరకోనకు 5, కన్యతీర్థంకు 2, శ్రీశైలానికి 2 బస్సులు చొప్పున మొత్తం 317 బస్సులను నడపనున్నామన్నారు. చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ప్రజలు ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.
గంగమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు
మార్చి 1న లక్కిరెడ్డిపల్లె మండలంలోని గంగమ్మ జాతరకు కడప నుంచి 25 బస్సులు, పులివెందుల నుంచి 25 బస్సులు నడుపుతున్నామన్నారు. అలాగే మార్చి 14న పౌర్ణమి నాడు తిరుమన్నామలై అరణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల, మైదుకూరు డిపోల నుంచి బస్సులు బయలుదేరుతాయని ఆర్‌ఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment