సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ
కడప అర్బన్: పోలీసు సిబ్బంది, సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్‌కుమార్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు ‘గ్రీవెన్స్‌డే’ నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్‌లు, ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది బదిలీలు, వ్యక్తిగత, స్పౌస్, చిల్డ్రన్స్ మెడికల్ సమస్యల గురించి స్వయంగా విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ సిబ్బంది సమస్యలను విని తగిన పరిష్కారం చూపుతామని వారికి భరోసా కల్పించారు. సిబ్బంది ఫిర్యాదులను పరిశీలించి సత్వరం పరిష్కరించాలని సంబంధిత జిల్లా పోలీసు కార్యాలయ అధికారులను ఆదేశించారు.
పోలీసు జాగిలం పదవీ విరమణ
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీస్ ప్రధాన కార్యాలయంలో మ్యాగి అనే పోలీసు జాగిలం శుక్రవారం పదవీ విరమణ పొందింది. మ్యాగి 11 సంవత్సరాలు పాటు విశిష్ట సేవలందించి పలు కీలక విధులను సమర్థవంతంగా నిర్వహించడం పట్ల జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు అభినందించారు. హత్యలు, రేప్‌లు, దొంగతనం చేసిన వారిని గుర్తించడంలో నేర్పరిగా పేరున్న జర్మన్ షపర్డ్ జాతికి చెందిన జాగిలం మ్యాగిని జిల్లా ఎస్పీ ఘనంగా సన్మానించారు.
సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment