● ఆందోళనలో ఉద్యోగులు
సంచార పశువైద్య వాహనాల్లో పనిచేసే పైలట్, పారావిరట్, డాక్టర్, ఇలా మొత్తం 21 మంది పనిచేస్తున్నారు. వీరందరిని వెళ్లమని చెప్పడంతో వారి కుటుంబాలు అందోళన చెందుతున్నాయి. ఉద్యోగాలు తిరిగి ఇస్తారా..ఇంతటితో ఆగిపోవాలా అన్న స్పష్టత లేకపోవడంతో ఉద్యోగల భవిషత్తు ప్రశ్నార్థకంగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2022 మే 19న జిల్లాలో మొదటి విడత అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. అప్పట్లో నియోజక వర్గానికి ఒక వాహనం చొప్పున కేటాయించారు. ప్రతి వాహనంలో వాహనాన్ని నడిపే పైలట్, పారావిట్, డాక్టర్ పనిచేసే వారు. వారంతా దాదాపు మూడేళ్ల దాకా పనిచేశారు. ఇప్పుడు ఉన్నట్లుండి రాత్రికి రాత్రే వారి సేవలు అపేయడంతో వారు అందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు తొలగించడంతో రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న తమ కుటుంబాలు వీధిన పడ్డాయని వాపోతున్నారు. వేతనాలు పెరుగుతాయని భావిస్తే.. తమకు చేదు అనుభవం ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగంలో కొనసాగించాలని వినతి
వైఎస్సార్‌జిల్లా పశు సంవర్ధకశాఖలో గత మూడు సంవత్సరాలుగా 42 మంది పశు సంచార వైద్య వాహనాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఈఎంఆర్‌ఐ ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్నామని, తమను ఉద్యోగంలో కొనసాగించాలని మైబెల్ అంబులెన్స్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై వారు జిల్లా పశు సంవర్ధకశాఖ జేడీ శారదమ్మకు వినతిపత్రాన్ని సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment