కడప కోటిరెడ్డిసర్కిల్: కిలోమీటరుకు రూ.1.88 ప్రకారంగా నిత్యపూజకోనకు రూ. 90 టిక్కెట్ ధరగా నిర్ణయించామని కడప డిపో మేనేజర్ డిల్లీశ్వరరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం కడప డిపోనుంచి నిత్యపూజకోనకు రెగ్యులర్ సర్వీసులు నడపనున్నామన్నారు. ఇప్పటికే దేవదాయశాఖ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ మహాశివరాత్రికి స్పెషల్ బస్సుల్లో ఎటువంటి ఆర్టీసీ పాసులు, ఆధార్‌కార్డు డిస్కౌంట్లు చెల్లుబాటు కావన్నారు. మహా శివరాత్రి సందరగా కడప–నిత్యపూజకోనకు రెండు స్టేజీలను ఏర్పాటు చేశామన్నారు. భాకరాపేట, సిద్దవటంలలో స్టాపింగ్ ఉంటుందన్నారు. భాకరాపేట నుంచి నిత్యపూజకోనకురూ. 60, సిద్దవటం నుంచి రూ.40ఛార్జి ఉంటుందన్నారు. కార్యక్రమంలో తాళపత్ర గ్రంథ లిపి నిపుణులు నాగదాసరి మునికుమార్, ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కన్యాకుమారి, సూపర్‌వైజర్ మంజుల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment