కడప అర్బన్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న పలు సోషల్ మీడియా అకౌంట్‌లపై జనసేన పార్టీ ఎన్నికల ప్రోగ్రాం కమిటీ రా యలసీమ కో–కన్వీనర్ పండ్రా రంజిత్‌కుమార్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చే శారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఫోటోల ను మార్ఫింగ్ చేసి ఆయన కుటుంబసభ్యులను అవమానపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు సమాజంలో విద్వేషాలు కలిగించేలా రాజకీయపార్టీల మధ్య ఘర్షణకు దారి తీసి శాంతికి భంగం కలిగించేలా వున్నాయనీ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే వైఎస్సార్ జిల్లా కడప తాలూకా ఎస్‌ఐ తాహీర్ హుసేన్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment